ఆ రెండు ప్రాంతాల్లో పులి సంచారం?

ABN , First Publish Date - 2022-04-24T05:34:42+05:30 IST

మండల పరిధిలోని తాటిపూడి, ముషిడిపల్లి ప్రాంతాల్లో పులి సంచరిస్తుందన్న వార్తలతో గ్రామీణులు హడలెత్తుతున్నారు.

ఆ రెండు ప్రాంతాల్లో పులి సంచారం?

 శృంగవరపుకోట రూరల్‌: మండల పరిధిలోని తాటిపూడి, ముషిడిపల్లి ప్రాంతాల్లో పులి సంచరిస్తుందన్న వార్తలతో గ్రామీణులు హడలెత్తుతున్నారు. శుక్ర వారం రాత్రి కొంతమందికి పులి కనపడిందన్న వార్త కలకలం రేపింది. మెంటాడ ప్రాంతంలో సంచరించిన పులి గంటికొండ నుంచి ఈ ప్రాంతంలోకి వచ్చి ఉంటుం దని అనుమనాలు వ్యక్తంచేస్తున్నారు. ఈవిషయంపై శృంగవరపుకోట అటవీ శాఖ డీఆర్వో గంగరాజును వివరణ కోరగా, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇంకా నిర్ధారించాల్సి ఉందని తెలిపారు.  

గంట్యాడ: మదనాపురంలోని అటవీ ప్రాం తంలో రెండు పులులు సంచరిస్తున్నట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. మండలంలోని అటవీ ప్రాంతాల పరిధిలోగల గ్రామాల్లో అప్ర మత్తంగా ఉండాలని సంబంధిత సచివాలయాల మహిళా పోలీసులకు గంట్యాడ ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌నాయుడు వాయిస్‌ మేసేజ్‌ పెట్టారు. ఆయా గ్రామాల్లో దండోరా వేయించాలని తెలిపారు. తాటిపూడికి వెనుక ఉన్న బొండపల్లి మండలంలోని పనసలపాడు గ్రామం సమీపంలోగల బండరాళ్లపై శుక్రవారం రాత్రి రెండు పులు లు నిద్రించినట్టు ఆ గ్రామానికి చెందిన యువకులు చర్చించుకుంటున్నారు. 

Read more