పాలకొండ ఆసుపత్రిపై విజి‘లెన్స్‌’

ABN , First Publish Date - 2022-08-02T05:20:01+05:30 IST

పాలకొండ ఏరియా ఆసుపత్రిలో సోమవారం శ్రీకాకుళం విజిలెన్స్‌ యూనిట్‌ సీఐ ఆర్‌.అప్పలనాయుడు నేతృత్వంలో సిబ్బంది సోదాలు చేపట్టారు.

పాలకొండ ఆసుపత్రిపై విజి‘లెన్స్‌’
రోగులతో మాట్లాడుతున్న విజిలెన్స్‌ సీఐ

పాలకొండ:  పాలకొండ ఏరియా ఆసుపత్రిలో సోమవారం శ్రీకాకుళం విజిలెన్స్‌ యూనిట్‌ సీఐ ఆర్‌.అప్పలనాయుడు నేతృత్వంలో  సిబ్బంది సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం, నాడు-నేడు పనుల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో  పారిశుధ్య నిర్వహణ, ఔట్‌సోర్సింగ్‌,  ఇతర విభాగాల సిబ్బంది హాజరు,  రికార్డులు పరిశీలించారు.  ప్రస్తుతం సిబ్బంది, రికార్డులు సరిపోల్చారు. నేరుగా రోగులతో మాట్లాడి వైద్యసేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం  వైద్యాధికారులు రఘురాం, తాజ్‌కుమార్‌, వైద్యసిబ్బందితో మాట్లాడారు.  సేకరించిన వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని విజిలెన్స్‌ అధికారులు తెలిపారు. Read more