విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2022-08-17T05:40:23+05:30 IST

మండలంలోని కెల్ల, ఆనందపు రం గ్రామాల్లో మంగళవారం సాయం త్రం వేర్వేరు ఘటనల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతిచెందారు.

విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

 గుర్ల:  మండలంలోని కెల్ల, ఆనందపు రం గ్రామాల్లో మంగళవారం సాయం త్రం వేర్వేరు ఘటనల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. కెల్ల గ్రామానికి చెందిన కెల్ల రమేష్‌(32) పొలంలోకి వెళ్తుండగా, నేలపై తెగిపడి ఉన్న విద్యుత్‌ వైర్లను చూసుకోకుండా అడుగేశాడు. దీంతో విద్యుత్‌ షాక్‌కు గురై, అక్కడికక్కడే మృతిచెందాడు. ఈయనకు భార్య బంగార మ్మ, ఇద్దరు ఆడపిల్లలు శ్రావ్య, శ్యామ ఉన్నారు. కూలి పనిచేస్తే గానీ పూట గడవని పరిస్థితి అని కుటుంబీకులు వాపోతున్నారు.  ఫ ఆనందపురం గ్రామాని కి చెందిన మీసాల అప్పలనాయుడు(34) కొత్తగా ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈ ఇంటి నిర్మాణానికిగాను వాటరింగ్‌ చేసే నిమిత్తం, తాత్కాలికంగా విద్యుత్‌మీటరు ను ఏర్పాటుచేశారు. మంగళవారం ఆ మీటర్‌ను ఆన్‌ చేయబోతుండగా, అప్పటికే మీటర్‌ వర్షానికి తడిచి ఉండడంతో, ఒక్కసారిగా మంటలు వచ్చి, షాక్‌ కొట్టింది. స్థానికులు వెంటనే ఆయన్ని విజయనగరం తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతుండగా, అప్పటికే మృతి చెందాడు. ఈయనకు భార్య రామలక్ష్మి, ఇద్దరు చిన్నారులు శ్యామల, హైమావతి ఉన్నారు. ఈయన కూలిపని చేసి కుటుంబాన్ని పోషించేవా డు. ఈయన మృతితో ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డు మీద పడినట్లు అయ్యిం ది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. రెండు మృతదేహాలను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. గుర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Updated Date - 2022-08-17T05:40:23+05:30 IST