రేపు కొవిడ్‌ మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌

ABN , First Publish Date - 2022-09-25T05:17:20+05:30 IST

జిల్లావ్యాప్తంగా ఈనెల 26న నిర్వహించనున్న కొవిడ్‌ మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి బి.జగన్నాథరావు సూచించారు.

రేపు కొవిడ్‌ మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌

పాలకొండ: జిల్లావ్యాప్తంగా ఈనెల 26న నిర్వహించనున్న కొవిడ్‌ మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి బి.జగన్నాథరావు సూచించారు. శనివారం మండలంలోని అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ కొవిడ్‌ టీకాలు వేయాలని సూచించారు. బూస్టర్‌ డోస్‌కు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. సీజనల్‌ వ్యాధులపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ పరిశీలనలో వైద్యులు అనిల్‌, సిబ్బంది యోగేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 


Read more