‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ పోస్టర్‌ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2022-11-30T23:58:14+05:30 IST

టీడీపీ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న ఇదేమిఖర్మ మన రాష్ట్రానికి పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి బుధవారం లక్కవరపుకోట లోని తన నివాసంలో నియోజకవర్గ కార్యక్రమాల పరిశీలకులు కిల్లి వేణుగోపాలస్వా మి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు

‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’   పోస్టర్‌ ఆవిష్కరణ

లక్కవరపుకోట: టీడీపీ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న ఇదేమిఖర్మ మన రాష్ట్రానికి పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి బుధవారం లక్కవరపుకోట లోని తన నివాసంలో నియోజకవర్గ కార్యక్రమాల పరిశీలకులు కిల్లి వేణుగోపాలస్వా మి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, పార్టీ పరిశీలకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా 45 నుంచి 50రోజుల్లో నియోజకవర్గంలో అన్ని కుటుంబాలను కలిసి ప్రభుత్వ దుర్మార్గం, ప్రజావ్యతిరేక విధానాలను వివరించాలని, అంతేకాకుండా ప్రతి కుటుంబం నుంచి ఒకమిస్‌కాల్‌ చేయించాలని కోరారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా, మనమంతా ఒక కుటుంబంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కా ర్యదర్శి కేబీఏ రాంప్రసాద్‌, రాబిన్‌సన్‌ టీం, టీడీపీ విశాఖపార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు రాయవరపు చంద్రశేఖర్‌, ఐదుమండలాల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, అనుబంధ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-11-30T23:58:14+05:30 IST

Read more