బాలిక అదృశ్యంపై మూడో రోజు విచారణ

ABN , First Publish Date - 2022-04-24T05:33:24+05:30 IST

మెంటాడ కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక అదృశ్యంపై విచారం కొనసాగుతోంది.

బాలిక అదృశ్యంపై మూడో రోజు విచారణ

మెంటాడ: మెంటాడ కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక అదృశ్యంపై విచారం కొనసాగుతోంది. ఈ ఘటనపై ముగ్గురిని సస్పెండ్‌ చేసిన ఉన్నతాధికారులు, సమగ్ర విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేశారు. రెండు రోజులుగా విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బందిని విచారించారు.  విద్యా ర్థిని అదృశ్యం వెనుక కారణాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల చుట్టూ ప్రహ రీ ఉన్నప్పటికీ బాలిక అదృశ్యం కావడం ఏమిటని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తు న్నారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, విద్యార్థిని అదృశ్యం అయితే ఎస్‌వో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, సిబ్బందితో ఫిర్యాదు చేయించడంపై ఆరా తీశారు. గతంలో కూడా ఎస్‌వో ప్రమీలాదేవిపై పలు విషయాల్లో షోకాజ్‌ నోటీ సులు అందగా, తాజాగా నాలుగో సారి విద్యార్థిని అదృశ్యంపై షోకాజ్‌ నోటీసు ఇచ్చినట్టు విచారణాధికారి సబ్‌జాన్‌ భాషా దృష్టికి వచ్చింది. దీంతో అందుకుగల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మెనూ నిర్వహణలో లోపాలపై ఆయన సీరియస్‌ అయ్యారు. సోమవారం కూడా విచారణ కొనసాగుతుందని విచారణాధికారి భాషా తెలిపారు.  

 

Read more