అధికార పార్టీ వారికే ఎక్కువ నష్ట పరిహారం

ABN , First Publish Date - 2022-12-13T00:15:50+05:30 IST

భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టుకు సంబంధించి భూసేక రణలో వైసీపీ పార్టీకి చెందిన వారికి ఒక విధంగా, మిగిలిన వారికి మరో విధంగా అధికారులు పరిహారం ఇచ్చారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజు ఆరో పించారు. సోమవారం కలెక్టరేట్‌ స్పందనలో కలెక్టరుకు వినతిపత్రం సమర్పించారు.

అధికార పార్టీ వారికే ఎక్కువ నష్ట పరిహారం

కలెక్టరేట్‌: భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టుకు సంబంధించి భూసేక రణలో వైసీపీ పార్టీకి చెందిన వారికి ఒక విధంగా, మిగిలిన వారికి మరో విధంగా అధికారులు పరిహారం ఇచ్చారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజు ఆరో పించారు. సోమవారం కలెక్టరేట్‌ స్పందనలో కలెక్టరుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ దల్లిపేట పంచాయతీ పరిధిలో గల రాళ్ళపాలెం, కవులువాడ, జమ్మయ్యపేటలో భూములు ఇచ్చిన పలు వురు రైతులకు సరైన ధర ఇవ్వలేదని, భూసేకరణకు 2015లో జీవో ఇచ్చారని అప్ప టిలో ఎకరాకు రూ.33 లక్షలు ఇచ్చారని, తరువాత మరికొంత భూమిని ప్రభుత్వం సేకరించిందన్నారు. తరువాత భూముల ధరలు పెరగడంతో భూములు ఇచ్చిన రైతుల్లో కొంతమందికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. వైసీపీకి చెందిన రైతు లకు ఎకరాకు రూ.కోటి చొప్పున ఇచ్చారని, మిగిలిన వారికి ఎకరాకు రూ.57 లక్షలు చొప్పున మంజూరు చేశారని ఆరోపించారు. అడిగిన వారికి ఒక విధంగా, అడగలేని వారికి మరో విధంగా ఇచ్చారన్నారు. వైసీపీ పాలనలో బడుగు, బలహీన వర్గాల ప్ర జలను భయపెట్టి భూములు తీసుకుంటున్నారని, వారికి సరైన పరిహారం ఇవ్వ డంలేదని విమర్శించారు. కొందరికి ఇళ్లు ఇచ్చారని ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలు ఇవ్వలేద న్నారు. ఈ సమస్యలపై రెండుసార్లు కలెక్టరుకి ఫిర్యాదు చేశామని ఇప్పటి వరకూ ప రిష్కారం లభించలేదని చెప్పారు. ఇకనైనా కలెక్టర్‌ స్పందించి పరిష్కరించాలని కోరా రు. ఈ కార్యక్రమంలో రైతులు ఉన్నారు.

Updated Date - 2022-12-13T00:16:43+05:30 IST

Read more