చెరువులో పడి వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2022-06-07T06:21:33+05:30 IST

నరవ గ్రామానికి చెందిన భోగాపురపు సన్యాసిరావు(64) చెరువులో పడి మృతిచెందాడు.

చెరువులో పడి వృద్ధుడి మృతి

గంట్యాడ: నరవ గ్రామానికి చెందిన భోగాపురపు సన్యాసిరావు(64) చెరువులో పడి మృతిచెందాడు. గంట్యాడ ఎస్‌ఐ కిల్లారి కిరణ్‌కుమార్‌ నాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సన్యాసిరావు ఎస్‌.కోటలోని పిండి మిల్లులో కూలి పని చేస్తుంటాడు. ఆదివారం మధ్యాహ్నం పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. వెంట నే బయటకి వెళ్తానని చెప్పి వెళ్లాడు. ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకు లు రాత్రి వరకూ వెతికారు. సోమవారం ఉదయం గ్రామ వైన్‌ షాపు ఎదురుగా ఉన్న చెరువులో సన్యాసిరావు మృతదేహం తేలి ఉండటంతో స్థానికులు వెంటనే కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య కొండమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఘటనా స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీయించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. 

 

Read more