వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడు చోరీ

ABN , First Publish Date - 2022-08-18T05:29:56+05:30 IST

వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడు చోరీ

వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడు చోరీ

సాలూరు: పట్టణ శివారు బంటి స్టేడియం సమీపంలో నివాసం ఉంటున్న వృద్ధురాలు తమ్మినేడి కుమారి మెడలోని సుమారు మూడు తులాల బంగారం పుస్తెలతాడుతో పాటు రూ.4వేలు చోరీకి గురయ్యాయి. బుధవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు... పదేళ్లుగా తమ్మినేడి కుమారి దంపతులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం పది గంటల సమయంలో బట్టలు ఆరబెట్టేందుకు కుమారి మేడపైకి వెళ్లి ఇంట్లోకి వచ్చింది. అప్పటికే మాటువేసిన ఆ అగంతకుడు ఇంట్లో ఎవరూ లేరని విషయాన్ని పసిగట్టి ఆమె ఇంట్లోకి వచ్చేసరికి నోట్లో గుడ్డలు కుక్కి, కత్తితో బెధిరించాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడు, పర్సులో ఉన్న నగదు పట్టుకుని పారిపోయాడు. వృద్ధురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read more