నిర్వాహకులే దుకాణాల రక్షణ చూసుకోవాలి’

ABN , First Publish Date - 2022-11-30T00:00:24+05:30 IST

మద్యం దుకాణాల్లో ఎటువంటి లూటికి లేదా అవాంఛనీయ ఘటనకు తావులేని రీతిలో నిర్వాహకులే రక్షణ చూసుకోవాలని ఎస్‌ఐ సురేంద్రనాయుడు సూచించారు. శ్రీకాకుళం జిల్లా లావేరులో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని దుండగులు లూటి చేసిన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రామభద్రపురంలోని మద్యం షాపులను మంగళవారం పరిశీలించారు.

నిర్వాహకులే దుకాణాల రక్షణ చూసుకోవాలి’

బొబ్బిలి (రామభద్రపురం): మద్యం దుకాణాల్లో ఎటువంటి లూటికి లేదా అవాంఛనీయ ఘటనకు తావులేని రీతిలో నిర్వాహకులే రక్షణ చూసుకోవాలని ఎస్‌ఐ సురేంద్రనాయుడు సూచించారు. శ్రీకాకుళం జిల్లా లావేరులో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని దుండగులు లూటి చేసిన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రామభద్రపురంలోని మద్యం షాపులను మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నైట్‌వాచ్‌మెన్‌ పోస్టు ఉండడంతో ఆయా షాపుల రక్షణ బాధ్యత వారిదేనని ఆయన తెలిపారు. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగే అవకా శముంటే వెంటనే తమకు సమాచారం అందివ్వాలని ఆదేశించారు. అనంతరం పలు కూడళ్లల్లో ఆయన వాహనాలు తనిఖీచేశారు.

Updated Date - 2022-11-30T00:00:24+05:30 IST

Read more