‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-12-06T23:54:52+05:30 IST

అన్ని వార్డుల్లో ఇదేమి ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమం విజయవంతం చేయాలని రాజాం నియో జకవర్గ టీడీపీ ఇన్‌చార్జీ కోండ్రు మురళీమోహన్‌ పి లుపునిచ్చారు

 ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం విజయవంతం చేయాలి

రాజాం: అన్ని వార్డుల్లో ఇదేమి ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమం విజయవంతం చేయాలని రాజాం నియో జకవర్గ టీడీపీ ఇన్‌చార్జీ కోండ్రు మురళీమోహన్‌ పి లుపునిచ్చారు. మంగళవారం శ్యాంపురం క్యాంపు కార్యాల యంలో 24 వార్డుల నాయకు లు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. ఇటువంటి అరాచక ప్రభుత్వాన్ని గద్దెదింపడమే లక్ష్యంగా ముందు కు సాగాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గురవాన నారాయణరావు, పొట్టా చిట్టి బాబు, శాసపు రమేష్‌కుమార్‌, మరిపి జగన్మోహన్‌, రగమండల గణపతిరావు, పొన్నా డ భీమేశ్వరరావు, కిమిడి అశోక్‌కుమార్‌, టంకాల నాగరాజు, కోటి, గోపి పాల్గొన్నారు.

త్వరలో చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన

రాజాం: త్వరలో ఉత్తరాంధ్రలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తారని రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జీ కోండ్రు మురళీమో హన్‌ తెలిపారు. మంగళవారం రాత్రి శ్యాంపురం క్యాంపు కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ మంత్రులను ఇన్‌చార్జీలుగా వేసి బీసీల ఆత్మాభిమా నం దెబ్బతీశారన్నారు. 70 సంవత్సరాల్లో ఎవ్వరూ చేయలేని సాహసం చేసి జగన్మో హన్‌రెడ్డి రాష్ట్రంలో ఐదుగురికి అధికారం ఇచ్చి రాష్ట్రాన్ని కీలుబొమ్మలాట ఆడిస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో పది సీట్లు కూడా వైసీపీకి రావ న్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్టీ, ఎస్సీ, బీసీ పఽథకాలు సర్వనా శనం చేశారని మండిపడ్డారు. చంద్రబాబునాయుడుకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి వైసీపీ నాయకులు తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. ఉన్న పరిశ్రమ యాజమాన్యాలను భయపెట్టడంతో నూతన పరిశ్రమలను రాకుండా చేస్తున్నారని నిరుద్యోగ సమస్యలు ఎలాతీరుతుందని ప్రశ్నించారు. రాజాం నియోజక వర్గంలో ఓవ్యక్తి గ్రానైట్‌ మైనింగ్‌ అనుమతులు కోసం ఎన్‌ఓసీకి వెలితే పెదిరెడ్డి అనుచరులు లాక్కోవడం శోచనీయమన్నారు.

Updated Date - 2022-12-06T23:54:53+05:30 IST