రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడికి గాయాలు

ABN , First Publish Date - 2022-11-19T00:02:34+05:30 IST

మండలంలోగల తోడగూడ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మొండెంఖల్‌ గ్రామానికి చెందిన ఎస్‌.సీతారాం అనే ఉపాధ్యాయుడికి గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడికి గాయాలు

కురుపాం: మండలంలోగల తోడగూడ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మొండెంఖల్‌ గ్రామానికి చెందిన ఎస్‌.సీతారాం అనే ఉపాధ్యాయుడికి గాయాలయ్యాయి. సీతారాం తన బైక్‌పై కురుపాం నుంచి మొండెంఖల్‌ వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి, ప్రమాదవశాత్తు బోల్తా పడ్డారు. దీంతో తలపై బలంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనంలో కురుపాం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2022-11-19T00:02:34+05:30 IST

Read more