-
-
Home » Andhra Pradesh » Vizianagaram » TDP leaders who called the people-MRGS-AndhraPradesh
-
బాదుడు ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి
ABN , First Publish Date - 2022-10-01T05:17:02+05:30 IST
బాదుడు ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు పిలుపునిచ్చారు.

ప్రజలకు పిలుపునిచ్చిన టీడీపీ నేతలు
సుడిగాంలో ర్యాలీ
పార్వతీపురం రూరల్, సెప్టెంబరు 30 : బాదుడు ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని సూడిగాం గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు దొగ. మోహన్ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లుగా అరాచక పాలన కొనసాగిస్తుందన్నారు. ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం దారుణమన్నారు. దీనిని ప్రతిఒక్కరూ ఖండిస్తున్నప్పటికీ ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోవడం భావ్యం కాదని తెలిపారు. పన్నులు, ఆర్టీసీ బస్సు, విద్యుత్ చార్జీలతో పాటు నిత్యావసర సరుకుల ధరలను పెంచుతూ సామాన్య, మధ్యతరగతి వర్గాలపై పెనుభారం మోపుతున్న వైసీపీ సర్కారును రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కోరారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోను దేవీచంద్రమౌళి, చంద్రమౌళి, వెంకటనాయుడు, నాగేశ్వర రావు, శ్రీనివాసరావు, ప్రసాద్, రామ్మూర్తినాయుడు, వెంకటరావు, దనుంజయ్, ఉదయభాను పాల్గొన్నారు.
కలిసి పనిచేద్దాం - గెలుపు సాధిద్దాం
జియ్యమ్మవలస, సెప్టెంబరు 30 : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని, నియోజకవర్గంలో గెలుపు సాధిద్దామని టీడీపీ పరిశీలకుడు గంటా నూకరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం చినమేరంగిలో మాజీ ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు స్వగృహంలో నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పరిశీలకుడితో పరిచయ కార్యక్రమం జరిగింది. అనంతరం పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి తోయక జగదీశ్వరి, రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు నంగిరెడ్డి మధుసూదనరావు, అరకు పార్లమెంటు నియోజకవర్గ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, మండల కన్వీనర్లు పల్ల రాంబాబు, శేఖరపాత్రుడు పాల్గొన్నారు.