పోస్టులు భర్తీ చేయండి

ABN , First Publish Date - 2022-06-07T05:48:14+05:30 IST

ప్రభుత్వ శాఖల్లో ఖాళీలున్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా రంజిత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

పోస్టులు భర్తీ చేయండి
కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న టీడీపీ నేతలు

   జాబ్‌ క్యాలెండర్‌తో సర్కారు దగా 

  నిరుద్యోగులను ఆదుకోవాలని టీడీపీ డిమాండ్‌

కలెక్టరేట్‌ ఎదుట నిరసన

బెలగాం, జూన్‌ 6 : ప్రభుత్వ శాఖల్లో ఖాళీలున్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని తెలుగు యువత  రాష్ట్ర  అధికార ప్రతినిధి కోలా రంజిత్‌కుమార్‌  డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం నిరుద్యోగులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌తో దగా చేస్తోందని, నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆరోపించారు. పాదయాత్ర సమయంలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం ఎంతవరకూ సమంజసమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌తో నిరుద్యో గులకు మొండిచేయి చూపిందని విమర్శించారు. ఏటా పోస్టులు భర్తీ చేస్తామని భ్రమ కల్పించారన్నారు.  కనీసం కారుణ్య నియామకాలు, బ్యాక్‌లాగ్‌ పోస్టులు కూడా భర్తీ చేయకపోవడం సర్కారుకు తగునా? అని ప్రశ్నించారు. తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం   ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. తక్షణమే జిల్లాలో పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు.  మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ,  పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల తెలుగు యువ నేతలు జాగాన రవిశంకర్‌, టి.శ్రీనివాస్‌, రమణ, తదితరులు పాల్గొన్నారు.

 

 

Read more