ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థిని దుర్మరణం

ABN , First Publish Date - 2022-10-11T05:59:12+05:30 IST

పట్టణంలోని రాజాం రోడ్డులో తోటపల్లి కాలు వ సమీపంలో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని ఎడ్ల సత్యవతి(14) అనే విద్యార్థిని మృతిచెందింది.

ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థిని దుర్మరణం

 చీపురుపల్లి: పట్టణంలోని రాజాం రోడ్డులో తోటపల్లి కాలు వ సమీపంలో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని ఎడ్ల సత్యవతి(14) అనే విద్యార్థిని మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గరివిడి మండలం కాపు శంబాం గ్రామానికి చెందిన సత్యవతి నెల్లిమర్ల కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. దసరా సెలవుల అనంతరం ఆమె తండ్రి కనకరాజుతో కలిసి నెల్లిమర్ల కేజీబీవీకి పయనమ య్యింది. ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, తోటపల్లి కాలువ సమీపంలోకి వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. తలకు బలమైన గాయాలు కావడంతో సత్యవతి అక్కడికక్కడే మృతి చెందింది. కనకరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న  చీపురు పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన తన కుమార్తె కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిందని, ఇంతలోనే తమను విడిచి వెళ్లపో యిందంటూ తండ్రి కనకరాజు ఘటనా స్థలంలో కన్నీరుమున్నీరయ్యారు.

 

Read more