తల్లి మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-06-07T06:19:46+05:30 IST

మాసగూడ గ్రామానికి చెందిన ఆరో తరగతి చదువు తున్న బిడ్డిక ప్రేమిక(14) ఆదివారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది.

తల్లి మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య

భామిని: మండలంలోని మాసగూడ గ్రామానికి చెందిన ఆరో తరగతి చదువు తున్న బిడ్డిక ప్రేమిక(14) ఆదివారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు.. పోడు పని చేసుకొని వచ్చేసరికి ఇంటి పనులు చేయలేదని తల్లి బంగారి ప్రేమికను మందలించింది. దీంతో క్షణికావేశంతో ఇంటి వద్ద ప్రేమిక ఉరేసుకొంది.  ప్రేమిక మృతి చెందడంతో తండ్రి కాంతారావు, తల్లి రోదించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రేమిక మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. బత్తిలి ఎస్‌ఐ అనీల్‌ కుమార్‌ కేసు నమోదు చేశారు. 

 

Read more