ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్‌లో తొక్కిసలాట

ABN , First Publish Date - 2022-11-02T23:34:30+05:30 IST

స్టుకోస్టు ఎక్స్‌ప్రెస్‌ రైలులో తొక్కిసిలాట జరిగి ఇద్దరు యువతులు తీవ్ర అస్వస్థతకు గురై విజయనగరం స్టేషన్‌లో దిగిన ఘటన మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. వారిని వెంటనే రైల్వే అధికారులు జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళ్తే..

ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్‌లో తొక్కిసలాట
చికిత్స పొందుతున్న బీబికా బిస్వాల్‌, లక్కీపాత్రా

విజయనగరంలో దించి ఆస్పత్రికి తరలించిన రైల్వే యంత్రాంగం

విజయనగరం క్రైం, నవంబరు 2: ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్‌ రైలులో తొక్కిసిలాట జరిగి ఇద్దరు యువతులు తీవ్ర అస్వస్థతకు గురై విజయనగరం స్టేషన్‌లో దిగిన ఘటన మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. వారిని వెంటనే రైల్వే అధికారులు జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాదు నుంచి హౌరా వెళ్తున్న ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్‌లో ఒడిశాకు చెందిన యువతులు బీబికా బిస్వాల్‌, లక్కీపాత్రా విజయవాడలో రైలు ఎక్కారు. వీరున్న బోగీలోకి రాజమహేంద్రవరం, విశాఖపట్టణంలో అధికంగా ప్రయాణికులు ఎక్కారు. పరిమితికి మించి జనం ఉండడంతో తీవ్ర రద్దీ చోటు చేసుకుంది. ఒకరిని ఒకరు నెట్టుకుంటూ ప్రయాణించారు. ఒకానొక దశలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో ఒడిశా యువతులు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడక ఇబ్బంది పడుతుండడాన్ని గమనించిన మిగతా ప్రయాణికులు విజయనగరం వచ్చాక రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారొచ్చి ఆస్వస్థతకు గురైన యువతులను జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సకాలంలో తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం వారి సొంత ప్రాంతమైన ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌కు జిల్లా పోలీసులు పంపించారు. కాగా ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐలు రవికిషోర్‌, రవివర్మలతో పాటు సిబ్బంది సమాచారం అందిన వెంటనే బోగి వద్దకు చేరుకుని క్షణాల్లో వారిని ఆస్పత్రికి తరలించారు. దీంతో యువతులు ప్రాణపాయం నుంచి బయటపడ్డారు.

Updated Date - 2022-11-02T23:34:30+05:30 IST
Read more