-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Special pujas at Thotapalli-NGTS-AndhraPradesh
-
తోటపల్లిలో ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2022-04-24T05:38:49+05:30 IST
ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గరుగుబిల్లి, ఏప్రిల్ 23 : ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు ఉచిత ప్రసాదాలు, అన్నసమారాధన నిర్వహించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. వీరఘట్టానికి చెందిన ప్రముఖ యజ్ఞకర్త ఎస్‌వీఎల్‌ఎన్ శర్మయాజీ ప్రోత్సాహంతో ఉభయ దేవాలయాల్లో కల్యాణాలు, సహస్ర కుంకుమార్చనలు, సుదర్శన హోమాలను నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో బి.లక్ష్మీనగేష్ తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత అన్నసమారాధనకు దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు.