ఎస్‌కోటను విశాఖలో విలీనం చేయాలి

ABN , First Publish Date - 2022-02-23T05:44:06+05:30 IST

శృంగవ రపుకోట నియోజవర్గాన్ని వి శాఖపట్టణంలో విలీనం చే యాల్సిన అవసరం ఎం తై నా ఉందని, ఈ విష యం లో ముఖ్యమంత్రి పునః పరి శీలన చేయాలని విశాఖ పట్టణం టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ ఎం. భరత్‌, శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి విజ్ఞప్తి చేశారు.

ఎస్‌కోటను విశాఖలో విలీనం చేయాలి

విశాఖ పార్లమెంటరీ టీడీపీ ఇన్‌చార్జి భరత్‌ 

కొత్తవలస:   శృంగవ రపుకోట నియోజవర్గాన్ని వి శాఖపట్టణంలో విలీనం చే యాల్సిన అవసరం ఎం తై నా ఉందని, ఈ విష యం లో ముఖ్యమంత్రి పునః పరి శీలన చేయాలని విశాఖ పట్టణం టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ ఎం. భరత్‌,  శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి విజ్ఞప్తి చేశారు. నియోజవర్గాన్ని విశాఖపట్టణం జిల్లాలో విలీనం చేయాలంటూ గత 8 రోజులుగా కొత్తవలస జంక్షన్‌లో నిర్వహిస్తున్న రిలే దీక్షల కార్యక్రమానికి మంగళవారం వీరు హాజరై మాట్లాడారు. 1979 వరకు శృం గవరపుకోట నియోజకవర్గం విశాఖ జిల్లాలోనే ఉండేదని, 1979లో జిల్లాల పునర్వి భజన తరువాత ఈ నియోజకవర్గాన్ని విజయనగరంలో విలీనం చేశా రన్నారు. ని యోజకవర్గాన్ని విజయనగరంలో విలీనం చేసినా విశాఖ పార్లమెంటరీ నియోజ కవ ర్గంలోనే శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం ఉందన్నారు. ఒక పార్ల మెం టరీ ని యోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటించడంతో శృంగవరపుకోట నియోజక వర్గా న్ని కూడా విశాఖపట్టణం జిల్లాలోనే విలీనం చేయాలన్నారు.  శృంగవరపుకోట నియో జకవర్గాన్ని విశాఖపట్టణంలో కాకుండా విజయనగరం జిల్లాలో విలీనం చేసేం దుకు యత్నాలు జరుగుతున్నాయన్నారు.  శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలకు, యు వతకు, వ్యాపారులకు న్యాయం జరగాలంటే ఈ నియోజకవర్గాన్ని విశాఖలోనే విలీనం చేయాలన్నారు. రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కేబీఏ రాం ప్రసాద్‌, సాధన సమితి నాయకులు గొరపల్లి రాము, గొడుగుల మహేంద్ర, గిరిబాబు, టీడీపీ నాయకులు కోళ్ల వెంకరమణ, కనకాల శివ, కొరుపోలు అప్పారావు పాల్గొన్నారు.   

Read more