21 రోజుల్లో ఉరి శిక్ష వేయాలి

ABN , First Publish Date - 2022-01-04T04:30:39+05:30 IST

గిరిజన బాలికలపై కిరాతకంగా ప్రవర్తించిన వైసీపీ కార్యకర్త, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అనుచరుడు రాంబాబుపై దిశా చట్టం కింద కేసు నమోదు చేసి 21 రోజుల్లో ఉరి శిక్ష వేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, సాలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మిడి సంధ్యారాణి డిమాండ్‌ చేశారు.

21 రోజుల్లో ఉరి శిక్ష వేయాలి
మాట్లాడుతున్న గుమ్మిడి సంధ్యారాణి


గిరిజన మహిళా మంత్రి నియోజకవర్గంలో వరుస ఘటనలు
టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి
సాలూరు, జనవరి 3:
గిరిజన బాలికలపై కిరాతకంగా ప్రవర్తించిన వైసీపీ కార్యకర్త, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అనుచరుడు రాంబాబుపై దిశా చట్టం కింద కేసు నమోదు చేసి 21 రోజుల్లో ఉరి శిక్ష వేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, సాలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మిడి సంధ్యారాణి డిమాండ్‌ చేశారు. ఆమె సోమవారం విలేకర్లతో ఫోన్‌లో మాట్లాడారు. విద్యార్థినులపై ఈ విధంగా ప్రవర్తించడం అత్యంత హేయమైన చర్యని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు సార్వసాధారణమైపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో గుమ్మలక్ష్మీపురం డిగ్రీ కళాశాల విద్యార్థినుల పట్ల కూడా కొందరు అసభ్యంగా ప్రవర్తించారని వారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకపోవటం దారుణమన్నారు. తాజా కేసులో నిందితుడి బైక్‌పై సీఎం జగన్‌ ఫొటో ఉంది కాబట్టి ప్రభుత్వం, పోలీసులు అండగా ఉంటారా అని ప్రశ్నించారు. అత్యాచారానికి గురైన బాలికలకు పునరావాసం, సరైన న్యాయం చేసే వరకు తమ పార్టీ తరుఫున పోరాటం ఆగదని స్పష్టంచేశారు. పోలీస్‌ అధికారులు తక్షణం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి అనుచరుడని ఉదాసీనంగా చూస్తే సహించేది లేదన్నారు.


Updated Date - 2022-01-04T04:30:39+05:30 IST