13న సేవా కార్యక్రమాలు

ABN , First Publish Date - 2022-12-09T23:58:15+05:30 IST

ఎస్‌.కోట ఆకుల డిపో వద్ద ఈనెల 13న తానచైతన్యవేదిక ఆధ్వర్యంలో సేవాకార్యాక్రమాలు నిర్వహిస్తున్నట్లు సభ్యుడు గొంప కృష్ణ తెలిపారు.

 13న సేవా కార్యక్రమాలు

శృంగవరపుకోట: ఎస్‌.కోట ఆకుల డిపో వద్ద ఈనెల 13న తానచైతన్యవేదిక ఆధ్వర్యంలో సేవాకార్యాక్రమాలు నిర్వహిస్తున్నట్లు సభ్యుడు గొంప కృష్ణ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తమ చైతన్యవేదిక ఆధ్వర్యంలో ఉచిత కాన్సర్‌ క్యాంపు నిర్వహిస్తామని చెప్పారు. 3వేల మందికి పంటల పిచికారి కిట్‌లు, 300 మందికి పురుగుల మందు స్ర్పేయింగ్‌ మిషన్లు అందించనున్నామన్నారు. వాటితో పా టు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తాన ప్రెసిడెంట్‌ లా వు అంజయ్య పర్యవేక్షణలో చేపట్టే ఈ కార్యక్రమంలో టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు భరత్‌ పాల్గొంటారన్నారు. విశాఖ పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు రాయవరపు చంద్రశేఖర్‌, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, టీడీపీ జామి అధ్య క్షుడు లగుడు రవికు మార్‌, మాజీ జడ్పీటీసీ బండారు పెదబాబు, టీడీపీ నాయకులు ఉన్నారు.

Updated Date - 2022-12-09T23:58:16+05:30 IST