24 కేజీల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-11-08T00:05:41+05:30 IST

మండలంలోని పి. కోనవలస చెక్‌పోస్టు వద్ద ఆదివారం రాత్రి అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని స్థానిక పోలీసులు పట్టుకున్నారు.

  24 కేజీల గంజాయి పట్టివేత

పాచిపెంట: మండలంలోని పి. కోనవలస చెక్‌పోస్టు వద్ద ఆదివారం రాత్రి అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. కొరాపుట్‌ జిల్లా దమన్‌జోడి నుంచి విశాఖపట్నం ఆర్టీసీ బస్సులో వెళుతున్న అక్రమ గంజాయిని అందిన సమాచారం మేరకు 24కేజీల 245 గ్రాముల గంజాయిని ఎస్‌ఐ ఎం.వెంకటరమణ, సిబ్బంది పట్టుకున్నారని సాలూరు సీఐ ఎస్‌.ధనుంజయరావు తెలిపారు. ఒడిశా ప్రాంతం కొరాపుట్‌ జిల్లా దమన్‌జోడి సమీపంలోగల మతాలిపుట్‌ గ్రామానికి చెందిన చందన్‌కుమార్‌ రౌతును అరెస్టు చేసి, గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Updated Date - 2022-11-08T00:05:41+05:30 IST

Read more