బియ్యం వినియోగించుకోవాలి: ఆర్డీవో

ABN , First Publish Date - 2022-12-31T00:15:58+05:30 IST

ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని కార్డుదారులు ఉప యోగించుకోవాలని, లేదంటే సంబంధిత కార్డులు నిలుపుదల చేస్తామని ఆర్డీవో ఎంవీ సూర్యకళ హెచ్చరించారు.

బియ్యం వినియోగించుకోవాలి: ఆర్డీవో

భోగాపురం: ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని కార్డుదారులు ఉప యోగించుకోవాలని, లేదంటే సంబంధిత కార్డులు నిలుపుదల చేస్తామని ఆర్డీవో ఎంవీ సూర్యకళ హెచ్చరించారు. శుక్రవారం భోగాపురంలో రేషన్‌ డిపోలను పరిశీ లించారు. కార్డుదారులు రేషన్‌ బియ్యాన్ని బయటకు విక్రయించినట్టు రుజువైతే సంబంధిత కార్డులు తొలగిస్తామన్నారు. చిన్న వీధి, తోట వీధిలోని డిపోల్లో ఉన్న స్టాకు రికార్డుల ప్రకారం ఉందా లేదా అని పరిశీలించారు. ఉచిత బియ్యం అందజే యడంలేదని తోట వీధిలో కొంతమంది కార్డుదారులు ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై పరిశీలించాలని సీఎస్‌డీటీ బీవీ మురళీకి ఆమె సూచించారు. అంతక ముందు గుడివాడలో రీసర్వేను పరిశీలించారు. హెచ్‌డీటీ బీవీ మురళి, వీఆర్వోలు రాంనాయుడు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:15:58+05:30 IST

Read more