రాజాం-పాలకొండ రోడ్డులో మరమ్మతులు

ABN , First Publish Date - 2022-11-03T00:16:26+05:30 IST

రాజాం-పాలకొండ రోడ్డులో గురవాం వద్ద అయ్యప్ప ఆలయం సమీపం నుంచి మరమ్మతులను అధికారులు బుధవారం ప్రారంభించారు

రాజాం-పాలకొండ రోడ్డులో మరమ్మతులు

రాజాం రూరల్‌: రాజాం-పాలకొండ రోడ్డులో గురవాం వద్ద అయ్యప్ప ఆలయం సమీపం నుంచి మరమ్మతులను అధికారులు బుధవారం ప్రారంభించారు. రాజాం ఆర్‌అండ్‌బీ పరిధిలోని రాజాం నుంచి శిర్లాం జంక్షన్‌ వరకూ మరమ్మతులకు ప్రభు త్వం రూ.70 లక్షలు మంజూరు చేసింది. రాజాం-శ్రీకాకుళం రోడ్డులోని సప్తగిరి కాలనీ సమీపంలో కూడా మరమ్మతులు ప్రారంభించారు. ఇక్కడ మూడు నెలల కిందటే మరమ్మతులు చేసిన విషయం విదితమే. రాజాం- పాలకొండ మధ్య రోడ్డుకు తా త్కాలిక మరమ్మతుల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని పలువురు వాహన చోదకులు వాపోతున్నారు. కాగా 15 రోజుల్లో రహదారి మరమ్మతులు పూర్తవుతాయని ఆర్‌అండ్‌బీ ఏఈ నాగభూషణరావు తెలిపారు.

Updated Date - 2022-11-03T00:16:26+05:30 IST
Read more