ఆ ముగ్గురికి రేషన్‌కార్డులు

ABN , First Publish Date - 2022-11-19T00:19:46+05:30 IST

ఆ ముగ్గురికి రేషన్‌ కార్డుల మంజూరుకు అన్ని చర్యలు చేపడుతున్నట్టు తహసీల్దారు రాజారావు తెలిపారు. ఇటీవల ‘సెంటు భూమి లేదు.. రేషన్‌ రద్దు’ అని ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి తహసీల్దారు స్పందించారు. శుక్రవారం బాధితులు ముగ్గురికి కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు.

ఆ ముగ్గురికి రేషన్‌కార్డులు
బాధితులతో మాట్లాడుతున్న తహసీల్దారు

ఆ ముగ్గురికి రేషన్‌కార్డులు

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

బొబ్బిలి, నవంబరు 18: ఆ ముగ్గురికి రేషన్‌ కార్డుల మంజూరుకు అన్ని చర్యలు చేపడుతున్నట్టు తహసీల్దారు రాజారావు తెలిపారు. ఇటీవల ‘సెంటు భూమి లేదు.. రేషన్‌ రద్దు’ అని ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి తహసీల్దారు స్పందించారు. శుక్రవారం బాధితులు ముగ్గురికి కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. వారి కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. చినబజారు వీధికి చెందిన సత్యవరపు లక్ష్మి తన పేదరికాన్ని ఏకరువు పెడుతూ కన్నీటి పర్యంతమైంది. భర్త లేకపోవడంతో బేకరీలో పనిచేసి కుటుంబాన్ని నడిపిస్తున్నానని అగురువీధికి చెందిన గర్భాపు సంతోషి తన పరిస్థితిని వివరించింది. మీగడ వీధికి చెందిన గంగాడ గౌరి తన దీనస్థితిని వివరించింది. తక్షణం వారి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని వీఆర్వో సుధాకర్‌ను తహసీల్దారు ఆదేశించారు. టీడీపీ మునిసిపల్‌ కౌన్సిలర్‌ వెలగాడ హైమావతి వారి వెంట ఉన్నారు.

Updated Date - 2022-11-19T00:19:49+05:30 IST