‘ పతాక’ స్థాయిలో ..

ABN , First Publish Date - 2022-08-15T05:41:33+05:30 IST

హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లాకేంద్రంలో 150 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు.

‘ పతాక’ స్థాయిలో ..
జోరువానలో 150 అడుగుల జాతీయ జెండా పట్టుకొని ర్యాలీ చేస్తున్న దృశ్యం

 150 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ

పార్వతీపురంటౌన్‌, ఆగస్టు 14 : హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లాకేంద్రంలో  150 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు.  పట్టణంలోని సెయింట్‌పీటర్స్‌ పాఠశాల నుంచి   కలెక్టరేట్‌ వరకూ ఇది కొనసాగింది. జోరువాన కురుస్తున్నా.. ఎంతో ఉత్సాహంతో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, మహిళా సంఘాలు, అధికారులు పాల్గొన్నారు.  జాతీయ జెండాను పట్టుకుని భారత్‌ మాతకీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌  మాట్లాడుతూ ... జిల్లా ఏర్పడిన తరువాత తొలిసారిగా జిల్లాకేంద్రంలో సోమవారం నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు, డీఆర్‌వో వెంకటరావు, డీడీ కిరణ్‌కుమార్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Read more