రైతులకు ఈక్రాప్‌ రశీదు అందించండి

ABN , First Publish Date - 2022-11-30T00:00:57+05:30 IST

రైతులకు ఈ-క్రాఫ్‌ నమోదు చేసిన రశీదులను డౌన్‌లోడ్‌ చేసి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మూడు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ వ్యవసాయాధికారులను ఆదేశించారు.

రైతులకు ఈక్రాప్‌ రశీదు అందించండి
లేఅవుట్‌ను పరిశీలలిస్తున్న కలెక్టర్‌

పార్వతీపురం - ఆంధ్రజ్యోతి, నవంబరు 29: రైతులకు ఈ-క్రాఫ్‌ నమోదు చేసిన రశీదులను డౌన్‌లోడ్‌ చేసి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మూడు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ వ్యవసాయాధికారులను ఆదేశించారు. మంగళవారం వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వ్యవసాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈక్రాప్‌ నమోదు చేసిన రైతులకు రశీదు కాపీ అందించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులపై ఉందన్నారు. పీఎం కిసాన్‌ యోజన పథకం డబ్బులు జమ కాని రైతుల ఖాతాలను ఈకేవైసీ పూర్తి చేయా లని తెలిపారు. అనంతరం పశు సంవర్ధకశాఖ, ఉద్యానవనశాఖ, మత్స్యశా ఖల అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్‌పా ల్‌, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కేవీఎస్‌ఎన్‌ రెడ్డి, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికా రి ఎ.ఈశ్వరరరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి వేమూరి తిరుపతయ్యపాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:00:57+05:30 IST

Read more