నేడు తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన

ABN , First Publish Date - 2022-12-13T23:57:55+05:30 IST

రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చడాన్ని నిరసిస్తూ తెలుగుయువత ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదుట నిరసన కార్యక్రమం జరుగుతుందని తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు వేమలి చైతన్యబాబు, విజయనగరం నియోజకవర్గ అధ్యక్షుడు గంటా రవి ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన

విజయనగరం రూరల్‌: రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చడాన్ని నిరసిస్తూ తెలుగుయువత ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదుట నిరసన కార్యక్రమం జరుగుతుందని తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు వేమలి చైతన్యబాబు, విజయనగరం నియోజకవర్గ అధ్యక్షుడు గంటా రవి ఒక ప్రకటనలో తెలిపారు. టీడీ పీ రాష్ట్రశాఖ ఆదేశాల మేరకు ఈ నెల 13న విజయనగరంలోని వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. తరువాత కార్యక్రమంగా ఈ నెల 14న ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదుట నిరసన చేపడుతున్నట్టు తెలిపారు. రానున్న కాలంలో ఇదే అంశంపై రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. తె లుగుయువత నాయకులు, యువతీ, యువ కులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2022-12-13T23:57:55+05:30 IST

Read more