సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-11-30T23:56:39+05:30 IST
మునిసిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగరాజు, జలగడుగుల కామేష్ డిమాండ్ చేశారు.

విజయనగరం రింగురోడ్డు: మునిసిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగరాజు, జలగడుగుల కామేష్ డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్లో ఏపీఎస్సీ సబ్‌ప్లాన్ అసెంబ్లీ కమిటీ చైర్మన్ గొల్ల బాబూరావును కలిసి వినతిపత్రం అందించారు. కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసి మరణించిన వారి కుటుంబాల్లోని ఒకరికి ఉపాధి కల్పించాలన్నారు.
ఫ బొబ్బిలి: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సెలవుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్దానిక మున్సిపల్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు శంకరరావు, వెంకటి మాట్లాడుతూ సెలవుల విషయంలో పాతపద్ధతిని కొనసాగిస్తూ యూనిఫామ్, సబ్బులు, చెప్పులు ఇవ్వాలని, తమ కాలనీలో రోడ్లను మరమ్మతు చేయించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం కమీషనరుకు మెమొరాండం అందజేశారు. ఫ బొబ్బిలి(రామభద్రపురం): గ్రీన్ అంబాసిడర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రామభద్రపురం మండల పరిషత్ కార్యాలయం ముందు బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా మండల కార్యదర్శి బలస శ్రీనివాసరావు మాట్లా డుతూ ఆరు నెలల నుంచి 18 నెలల వరకు ఉన్న బకాయిలను వెంటనే చెల్లిం చాలని తదితర డిమాండ్లు చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. ఫ విజయనగరం దాసన్నపేట: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు, సెక్యూరిటీ గార్డు లకు పెంచిన జీతాలు చెల్లించపోతే ఆ కాంట్రాక్టర్‌ను తక్షణమే రద్దు చేయా లని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ప్రకాష్, ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు. బుధవారం లేబర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఐటీయూసీ ప్రతినిధి అప్పారావు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Read more