కూలి రేట్లపై స్పందనేదీ?

ABN , First Publish Date - 2022-09-20T05:10:30+05:30 IST

సివిల్‌ సప్లయ్‌ శాఖలో పనిచేస్తున్న తమకు కూలి ధరలు పెంచాలని హమాలీలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు.

కూలి రేట్లపై స్పందనేదీ?
అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలుపుతున్న హమాలీలు

కలెక్టరేట్‌ ఎదుట హమాలీల నిరసన 

బెలగాం, సెప్టెంబరు 19 :   సివిల్‌ సప్లయ్‌ శాఖలో పనిచేస్తున్న తమకు కూలి ధరలు పెంచాలని హమాలీలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు.  సుమారు 6 వేల మందికి సంబంధించి నూతన కూలిపై ఇంతవరకు కార్పొరేషన్‌ నోరు మెదపకపోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు.  వాస్తవంగా ప్రతి రెండేళ్లకు కూలి రేట్లు మార్పుపై కార్పొరేషన్‌ స్పందించాల్సి ఉందన్నారు.  ఈ ఏడాది జనవరితో గడువు ముగిసినా  ఇంతవరకూ స్పందించలేదని వారు తెలిపారు.  దీనిపై ఈ నెల 22లోగా కార్పొరేషన్‌ ఎండీ స్పందించకుంటే సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ నిరసనలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్శి టి.జీవన్న, మేస్త్రీలు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

 


Read more