29న పాలీసెట్‌

ABN , First Publish Date - 2022-05-19T05:12:35+05:30 IST

ఈనెల 29న జరగనున్న పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షకు పక్కగా ఏర్పాట్లు చేయాలని డీఆర్‌వో గణపతిరావు ఆదేశించారు. తన చాంబర్‌లో ఆయా శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

29న పాలీసెట్‌
మాట్లాడుతున్న డీఆర్‌వో గణపతిరావు


పరీక్షకు పక్కా ఏర్పాట్లు: డీఆర్‌వో
కలెక్టరేట్‌, మే 18:
ఈనెల 29న జరగనున్న పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షకు పక్కగా ఏర్పాట్లు చేయాలని డీఆర్‌వో గణపతిరావు ఆదేశించారు. తన చాంబర్‌లో ఆయా శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరం పట్టణంలోని 10 కేంద్రాలు, బొబ్బిలిలో 9, గజపతినగరంలో 4 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకూ పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష హాల్‌లోకి గంట ముందు అనుమతిస్తారని, 11 తరువాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని చెప్పారు. విద్యాశాఖ నుంచి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు కట్టుదిట్టంగా జరిగేలా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. వేసవిలో దృష్టిలో పెట్టుకుని ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లును ప్రథమ చికిత్సకు అవసరమైన ముందులను పరీక్షా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్దకు అవసరమైన చోట బస్సులు నడపాలని, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో పాలిటెక్నికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, జిల్లా పరీక్షల సమన్వయ అధికారి విజయలక్ష్మి, విద్యాశాఖ ఏడీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.


Read more