చంద్రబాబుతోనే పోలవరం సాధ్యం

ABN , First Publish Date - 2022-12-13T23:55:21+05:30 IST

పోలవరం పూర్తవ్వాలంటే చంద్రబాబుతోనే సాధ్యమవుతుం దని విశాఖ పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌ అన్నారు

చంద్రబాబుతోనే పోలవరం సాధ్యం

శృంగవరపుకోట: పోలవరం పూర్తవ్వాలంటే చంద్రబాబుతోనే సాధ్యమవుతుం దని విశాఖ పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌ అన్నారు. మంగళవారం స్థానిక ఆకుల డిపో వద్ద ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలోని తానా చైతన్య స్రవంతి కింద పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ శిబిరం, పవర్‌ స్ర్పేయర్‌లు, సేప్టీ కిట్లు పంపిణీ చేసారు. దీనికి ముఖ్య అతిఽథిగా వచ్చిన శ్రీభరత్‌ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రాంతంలో వ్యవసాయానికి సాగునీరెలా వస్తుందని రైతులను ప్రశ్నించారు. వర్షాదారంపై పంటలు పండిస్తా మని రైతుల నుంచి సమాధానం రావడంతో పోలవరం ప్రాజెక్టు పూర్తియితేనే ఇక్కడ పొలాలకు సాగు, తాగునీరు అందుతుందని తెలిపారు. దీన్ని పూర్తి చేసేం దుకు గత తెలుగు దేశం ప్రభుత్వంలో అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యం ఇచ్చారని, అప్పట్లో ఈ ప్రోజెక్టును చూపించేందుకు నియోజకవర్గాల నుంచి రైతులను తీసుకువెళ్లారని, దాదాపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే సమ యంలో ప్రభుత్వం మారడంతో మూడున్నర ఏళ్లగా ప్రోజెక్టు పనులు నిలిచిపోయా యన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే ఈ ప్రోజెక్టు పూర్తవుతుందని స్పష్టం చేశా రు. ఉత్తర అమిరికా తెలుగు సంఘం(తానా) ప్రతి ఏటా డిసెంబర్‌ నుంచి జన వరి వరకు సేవాకార్యక్రమాలు చేస్తుందన్నారు. తానా తరుపున వీటికి ఆర్థిక సహాయం అందించిన గొంప కృష్ణను అభినందించారు. తానా సహకారంతో గీతం యూరివర్సీటీలో దక్షణ భారత దేశంనకు చెందిన రాష్ట్రాలకు చెందిన దివ్యాంగు లతో క్రికెట్‌ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. తానా సభ్యులు అంజయ్య చౌదిరి లావు, యర్లగడ్డ వెంకటరావు, వేమూరి సతీష్‌, టీడీపీ నాయకులు రాయవరపు చంద్రశేఖర్‌, రెడ్డి వెంకన్న, గోరపల్లి రాము, పెదబాబు, పైడిబాబు, లగుడు రవి కు మార్‌, గొంప వెంకటరావు, గుమ్మడి భారతి తదితరులు వున్నారు. ఈ కార్యక్రమం లో పలు సంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పల్సర్‌ బైక్‌ రమణ, జానకీరామ్‌ బృందం జానపదగీతాలు, మహిళలు కోలాటం, దింస్సా వంటి నృత్యాలు సభి కులను ఆకట్టుకున్నాయి. ఐదు మండలాల నుంచి రైతులు, మహిళలు, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు.

Updated Date - 2022-12-13T23:55:22+05:30 IST