తల్లిదండ్రులు మందలించారని..
ABN , First Publish Date - 2022-12-13T23:50:27+05:30 IST
తరచూ హాస్టల్ నుంచి ఎందుకు ఇంటి వచ్చేస్తున్నా వని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

జామి: తరచూ హాస్టల్ నుంచి ఎందుకు ఇంటి వచ్చేస్తున్నా వని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ఏఎస్ఐ నర్శింగరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో ని లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొల్లి గణేష్(22) విశాఖపట్నం లోని ఒక కళాశాలలో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. సోమవారం హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లాడు. అస్తమానం ఇలా ఇంటికి వచ్చేస్తే చదువు ఏమవుతుంద ని, హాస్టల్లో ఉండకుండా ఎందుకు వస్తున్నావని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన గణేష్ తమ పొలంలో ఉన్న పశువుల పాకలో ఉంచిన గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఏఎస్ఐ తెలిపారు.
Read more