అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2022-09-10T05:33:48+05:30 IST

పట్టణంలోని గాడివీధి రామమందిరానికి ఎదురుగా నివాసం ఉంటున్న దాసిరెడ్డి సత్యవతి(75) అనే మహిళ శుక్రవా రం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

సాలూరు: పట్టణంలోని గాడివీధి రామమందిరానికి ఎదురుగా నివాసం ఉంటున్న దాసిరెడ్డి సత్యవతి(75) అనే మహిళ శుక్రవా రం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. వివరాలు ఇలా ఉన్నా యి. సత్యవతి భర్త సాంబమూర్తి 20 ఏళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందగా, కొడుకు కృష్ణ కూడా పదేళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో ఆమె ఒక్కర్తే ఆ గృహంలో నివాసం ఉం టోంది. ఈమె ఇటీవల కాలంలో అనేక దేవాలయాల నిర్మాణానికి లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చేవారని, తాజాగా గురువారం బొడ్డవలసలో కుండ్ల పోలమ్మ ఆలయ నిర్మాణానికి రూ.5వేలు విరాళంగా ఇచ్చారని ఆమె తమ్ముడు పిల్లా మురళి చెప్పారు. శుక్రవారం ఉదయం లేచిన తర్వాత ఒంటి గంట సమయంలో విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ తీసేందుకు ఓ వ్యక్తి వచ్చారని, అంతవ రకు ఆ ఇంటికి ఎవరూ రాలేదని స్థానికులు చెబుతున్నారు. పట్టణంలో సాయి భక్త మండలికి చెందిన రఘునందన్‌తో ఆమె నిత్యం ఫోన్ల్‌ మాట్లాడేవారని చెబుతు న్నారు. రఘునందన్‌కు ఆమె ఫోన్‌ చేయటంతో ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చారు. అయితే అప్పటికే ఆమె మృత్యువాత పడినట్టు రఘునందన్‌ చెబు తున్నా రు. బాధితురాలి వద్ద ఉన్న రెండు తులాల బంగారం గాజులు, హారం, నక్లెస్‌, చెవి లో ఉన్న వస్తువులతో పాటు పలు బంగారం ఆభరణాలు ప్రస్తుతం లేవు, బిరువా లు కూడా తెరిచిఉన్నాయి. రఘునందన్‌ ఇచ్చిన సమాచారం మేరకు డీఎస్పీ ఎ.సుభాష్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఇంటికి వచ్చిన వారిని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు. 

 

Read more