పక్కిలో జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక

ABN , First Publish Date - 2022-11-21T00:53:54+05:30 IST

మండలంలోని పక్కి జిల్లా పరిషత్‌ హైస్కూలు మైదానంలో ఆదివారం జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు

పక్కిలో జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక

బొబ్బిలి: మండలంలోని పక్కి జిల్లా పరిషత్‌ హైస్కూలు మైదానంలో ఆదివారం జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. క్రీడా సంబరాల్లో భాగంగా నియోజకవర్గ పరిధిలోని బొబ్బిలి, బాడంగి, తెర్లాం, రామభద్రపురం మండలాలకు చెందిన వాలీబాల్‌, కబడీ క్రీడాకారులను ఎంపిక చేసేందుకు నిర్వహించిన పోటీలను ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పల నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమలో సీనియర్‌ నేత శంబంగి వేణుగోపాల నాయుడు, ఎంపీడీవో అల్లు భాస్కరారవు, ఎంఈవో చల్లా లక్ష్మణరావు, సర్పంచ్‌ పైడిరాజు, హెచ్‌ఎం మూర్తి, వ్యాయామ ఉపాధ్యాయులు నల్ల వెంకటనాయుడు, శివున్నాయుడు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-21T00:53:54+05:30 IST

Read more