-
-
Home » Andhra Pradesh » Vizianagaram » minister kottu satyanarayana vijayanagaram andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
Kottu satyanarayana: చంద్రబాబుపై మంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-10-11T16:07:49+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబుపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యన్నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu naidu)పై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu satyanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... కొంత మంది దుర్మార్గులు మూడు రాజధానులను అడ్డుకుంటున్నారని అన్నారు. అమరావతి రైతుల ఫేక్ యాత్రను చంద్రబాబు (TDP Chief) కొనసాగిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి మోసపోయామని... కండకావరాలను నోటి కొవ్వుని టీడీపీ (TDP) ప్రదర్శిస్తోందని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పన్నాగాలు దూది పింజెల్లా కొట్టుకుపోతాయని మంత్రి కొట్టు సత్యనారాయణ (AP Minister) విమర్శలు గుప్పించారు.