-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Minister Bosta comments anr-MRGS-AndhraPradesh
-
Minister Bosta: వచ్చే ఎన్నికల్లో వైసీపీ వారసుల ఎంట్రీపై మంత్రి బొత్స ఏమన్నారంటే..
ABN , First Publish Date - 2022-09-29T17:52:42+05:30 IST
వచ్చే ఎన్నికల్లో వైసీపీ (YCP) వారసుల ఎంట్రీపై విద్యాశాఖ మంత్రి బొత్స సీరియస్ అయ్యారు.

అమరావతి (Amaravathi): వచ్చే ఎన్నికల్లో వైసీపీ (YCP) వారసుల ఎంట్రీపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Bosta Sathyanarayana) సీరియస్ (Serious) అయ్యారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వారసులు అందరికీ ఉంటారని, తనకూ కుమారుడు ఉన్నాడని అన్నారు. ఎవరైనా వారసుల్ని దింపొచ్చు.. కానీ ప్రజలు ఆమోదించాలి కదా అని అన్నారు. 175 స్థానాలు గెలవాలనుకోవటం అత్యాశ కాదని, ఒక్క స్థానం పోయినా ఫర్వాలేదు అనుకుంటే ఆ సంఖ్య క్షేత్రస్థాయిలో 10 అవుతుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడు ఎన్నికపై తనకు సమాచారం లేదని చెప్పారు. తమ పార్టీ విషయాలు తాము మాట్లాడుకుంటామని, అవి మీడియాకు అనవసరమన్నారు. శాఖాపరమైన సమీక్షలు జరిపినట్లే పార్టీ పరంగా సీఎం జగన్ (CM Jagan) ఎమ్మెల్యేల పనితీరు సమీక్షించి లోటు పాట్లు చెప్పారన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా అంతిమ లక్ష్యం గెలుపేనని.. అదే విషయం ముఖ్యమంత్రి అందరికీ గట్టిగా చెప్పారని మంత్రి బొత్స తెలిపారు.