వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-12-13T23:52:35+05:30 IST

మండలంలోని పెంటశ్రీరాంపురం గ్రామానికి చెందిన పాండ్రంకి దుర్గమ్మ(47) పురుగు మందు తాగి సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది.

వివాహిత ఆత్మహత్య

గంట్యాడ: మండలంలోని పెంటశ్రీరాంపురం గ్రామానికి చెందిన పాండ్రంకి దుర్గమ్మ(47) పురుగు మందు తాగి సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి గంట్యాడ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. దుర్గమ్మకు 20 ఏళ్ల కిందట గ్రామానికి చెందిన ముత్యాలుతో వివాహం జరిగింది. అయితే ముత్యాలుకు గతంలో ఒక వివాహం జరిగింది. మొదటి భార్యతో వివాదం రావడంతో ఆమెకు విడాకులు ఇచ్చి, కొన్ని రోజుల తర్వాత దుర్గమ్మను వివాహం చేసుకున్నాడు. ఇంతవరకూ వీరికి పిల్లలు లేరు. అయితే ముత్యాలు మొదటి భార్యతో మాట్లాడుతున్నడనే అనుమానం తోపాటు మద్యం కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నాడని దుర్గమ్మ మానసికంగా విసుగు చెందింది. దీంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు సత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2022-12-13T23:52:35+05:30 IST

Read more