కార్మికుల శ్రమను దోచుకోవడం అన్యాయం

ABN , First Publish Date - 2022-11-17T00:05:18+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న బడుగు, బలహీన వర్గాలకు చెందిన కాంట్రాక్టు పారి శుద్ధ్య కార్మికులు, సెక్యూటీ గార్డులు, పెస్ట్‌ కంట్రోల్‌ వర్కర్స్‌కి వేతనాలు పెంచు తున్నట్టు ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ వాటిని అమలు చేయకుండా వారి శ్రమను దోచుకుంటున్నారని ఏఐ టీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ మునకాల శ్రీనివాస్‌ ఆరోపించారు.

కార్మికుల శ్రమను దోచుకోవడం అన్యాయం

బొబ్బిలి: ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న బడుగు, బలహీన వర్గాలకు చెందిన కాంట్రాక్టు పారి శుద్ధ్య కార్మికులు, సెక్యూటీ గార్డులు, పెస్ట్‌ కంట్రోల్‌ వర్కర్స్‌కి వేతనాలు పెంచు తున్నట్టు ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ వాటిని అమలు చేయకుండా వారి శ్రమను దోచుకుంటున్నారని ఏఐ టీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ మునకాల శ్రీనివాస్‌ ఆరోపించారు. ఏపీ మెడికల్‌ కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) ఇ చ్చిన పిలుపు మేరకు బుధవారం స్థానిక సీహెచ్‌సీ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుకార్మికుల శ్రమను దోచుకోవడం అన్యా యమని, ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. శ్రమకు తగ్గ ఫలి తాన్ని అందజేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక వైద్యాధికారి డాక్టర్‌ శశిభూషణరా వుకు మెమొరాండం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పొడు గు అశోక్‌, బాబ్జీ, కృష్ణ, శంకరరావు, రామారావు, ఎస్‌.రాణి, సల్మాన్‌ఖాన్‌ తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T00:05:19+05:30 IST