స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల షురూ..

ABN , First Publish Date - 2022-08-02T05:20:52+05:30 IST

జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవ   ఏర్పాట్ల షురూ..
స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న జేసీ తదితరులు

పార్వతీపురంటౌన్‌, ఆగస్టు1:  జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను చురుగ్గా   చేస్తున్నారు.  ఈ మేరకు సోమవారం జాయింట్‌ కలెక్టర్‌ ఒ.ఆనంద్‌   పనులను పరిశీలించారు. మైదానంలోని స్వాతంత్య్ర దినోత్సవ వేదికకు ఇరువైపులా ప్రదర్శన శాలలు ఏర్పాటు చేయాలని,  ఆయా శాఖల ప్రగతిని చూపే శకటాలు ప్రధాన ద్వారం గుండా వచ్చేలా చూడాలని ఆదేశించారు. నూతన జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం సమష్టిగా పని చేయాలని సూచించారు. వేడుకల్లో పాల్గొనే అతిథులకు ఎటువంటి ఇబ్బం దులు కలగకుండా చూడాలని కోరారు. ఈ  పరిశీలనలో ఏఎస్పీ దిలీప్‌ కిరణ్‌,  డీఆర్‌వో వెంకటరావు, డీఎస్పీ సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు. 

  

Read more