వీడని వర్షం

ABN , First Publish Date - 2022-10-07T03:29:05+05:30 IST

ల్లా వ్యాప్తంగా బుధ, గురువారాల్లో చిరుజల్లులు పడుతునే ఉన్నాయి. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పార్వతీపురం, సాలూరు, పాలకొండ పట్టణాల్లో అస్తవ్యస్తంగా మారాయి. కాలువలు పొంగి ప్రవహించాయి. రహదారులపైనే వర్షపు నీరు పారింది. దీంతో ప్రజలు, వాహన చోదకులు అసౌకర్యానికి గురయ్యా

వీడని వర్షం
తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీటి ఉధృతి

రెండురోజులుగా చిరుజల్లులు

తోటపల్లి ప్రాజెక్టుకు వరద పోటు

రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల 

గరుగుబిల్లి/సాలూరు రూరల్‌, అక్టోబరు 6: జిల్లా వ్యాప్తంగా బుధ, గురువారాల్లో చిరుజల్లులు పడుతునే ఉన్నాయి. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పార్వతీపురం, సాలూరు, పాలకొండ పట్టణాల్లో అస్తవ్యస్తంగా మారాయి. కాలువలు పొంగి ప్రవహించాయి. రహదారులపైనే వర్షపు నీరు పారింది. దీంతో ప్రజలు, వాహన చోదకులు అసౌకర్యానికి గురయ్యారు. సాలూరు ఏజెన్సీలో సువర్ణముఖి నది పొంగి ప్రవహిస్తోంది. దీంతో నది అవతల వైపు ప్రాంతాల వారు భయం మాటున రాకపోకలు సాగిస్తున్నారు. మొక్కజొన్నతో పాటు ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. అటు తోటపల్లి జలాశయానికి వరద నీరు పోటెత్తింది. ఇన్‌ఫ్లో పెరగడంతో అధికారులు అప్రమతమయ్యారు. ప్రాజెక్టులో నీరు గరిష్ఠ నీటిమట్టం 105 మీటర్లకు చేరుకుంది. గురువారం సాయంత్రానికి నదిలోకి 3.249 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. రెండు గేట్లు ఎత్తి 3.643 క్యూసెక్కులు కిందకు విడిచిపెడుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. 


Read more