పోలీసుల నుంచి తప్పించుకొనే క్రమంలో..

ABN , First Publish Date - 2022-07-18T05:31:01+05:30 IST

పోలీసుల నుంచి తప్పించుకున్న ఓ ఆటో స్కూటీని ఢీకొట్టిం ది. దీంతో స్థానికులు ఆ ఆటోడ్రైవర్‌ను పట్టుకొని దేహశుద్ధి చేశారు.

పోలీసుల నుంచి తప్పించుకొనే క్రమంలో..

  స్కూటీని ఢీకొన్న ఆటో  

 గంజాయితో పట్టుబడిన నిందితుడు

శృంగవరపుకోట: పోలీసుల నుంచి తప్పించుకున్న ఓ ఆటో స్కూటీని ఢీకొట్టిం ది. దీంతో స్థానికులు ఆ ఆటోడ్రైవర్‌ను పట్టుకొని దేహశుద్ధి చేశారు. చివరకు ఆ ఆటోడ్రైవర్‌ గంజాయితో పోలీసులకు చిక్కాడు. శనివారం ఎస్‌.కోట ఠాణా ఎదురు గా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో అరకు నుంచి వస్తు న్న ఓ ఆటో, అతివేగంగా తప్పించుకొని వెళ్లిపోయింది. దీంతో పోలీసులు వాహనా లతో వెంబడించారు. ఈక్రమంలో స్థానిక రైతు బజారు వద్ద వేరే ఆటోను తప్పించే క్రమంలో ముందునున్న స్కూటీను ఢీకొట్టింది. స్కూటీపై ఉన్న ఇద్దరు వ్యక్తులు కిందపడ్డారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌ను స్థానికులు చితకబాదారు. ఇంతలో పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఆటోను తనిఖీ చేయడంతో గంజాయి పొట్లాలు బయటపడ్డాయి. గంజాయితో ఉన్న ఆటోను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే ఆటోలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరగగానే వీరిద్దరు పారిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై సీఐ సింహాద్రినాయుడు, ఎస్‌ఐ తారకేశ్వరరావు ఆదివారం రాత్రి విలేకర్ల సమావేశం ఏర్పాటుచేసి, వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం వాహనా లను తనిఖీ చేస్తుండగా, ఓ ఆటో ఆపకుండా వెళ్లిందని చెప్పారు. వెంబడించి రైతు బజారు వద్ద పట్టుకున్నామని, ఆటోలో గంజాయి పొట్లాలు ఉండడంతో స్వాధీనం చేసుకున్నామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుబ్రిగూడ మండలం కొరంజి గూడ గ్రామానికి చెందిన పాంగి ధనర్జయ్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పా రు. ఇదే జిల్లా ముంచింగపుట్ట మండలం మాకవరం గ్రామానికి చెందిన వనం పరశరాంతో కలిసి ఒడిశాలో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ప్రస్తుతానికి ఇతను పరారీలో ఉన్నాడని చెప్పారు. 168 కేజీల గంజాయి పట్టుబడగా, వీటి విలువ రూ.2.36లక్షలు ఉంటుం దని తెలిపారు. నిందితుడు ధనర్జయ్‌ను రిమాండ్‌కు పంపామని చెప్పారు.

Read more