అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు

ABN , First Publish Date - 2022-11-24T23:57:20+05:30 IST

మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ పార్వతీపురం జుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ డి.సౌజన్య తీరునిచ్చారు.

అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు

గరుగుబిల్లి: మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ పార్వతీపురం జుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ డి.సౌజన్య తీరునిచ్చారు. గరుగుబిల్లి హెచ్‌సీ ఎం.రామారావు కథనం మేరకు.. ఉల్లిభద్ర గ్రామానికి చెందిన రౌతు రాజేశ్వరి 2019లో గ్రామానికి చెందిన బొత్స రవిపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అప్పటి ఎస్‌ఐ వై.సింహాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు. నేరం రుజువు కావడంతో సెక్షన్‌ 354, 354 (డి)ల ప్రకారం రవికి రెండేళ్లు జైలు శిక్ష, రూ. నాలుగువేలు జరిమానాను పార్వతీపురం జ్యూడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ విధించారు. ఏపీపీ కె.చంద్రాకుమార్‌ ప్రాసుక్యూషన్‌ తరుపున వాదించారు.

Updated Date - 2022-11-24T23:57:20+05:30 IST

Read more