పొంచిఉన్న ప్రమాదం

ABN , First Publish Date - 2022-11-24T00:37:31+05:30 IST

మండలంలోని రావివలస ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన కల్వర్టు వద్ద ప్రమాదం పొందచి ఉంది. దశాబ్దాల తరబడి కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఇక్కడప్రమాదభరితంగా తయారైంది.

పొంచిఉన్న ప్రమాదం
శిలావస్థకు చేరిన రావివలస రహదారిపై కల్వర్టు

- కూలితే రాకపోకలకు అంతరాయం

- ఇదీ రావివలస రహదారిపై కల్వర్టు పరిస్థితి

గరుగుబిల్లి: మండలంలోని రావివలస ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన కల్వర్టు వద్ద ప్రమాదం పొందచి ఉంది. దశాబ్దాల తరబడి కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఇక్కడప్రమాదభరితంగా తయారైంది. గతంలో నాగావళి పిల్ల కాలువపై కల్వర్టు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత ఎటువంటి మరమ్మతులకు నోచుకోలేదు. ఈ మార్గం గుండా భారీ వాహనాలతోపాటు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఏ మాత్రం కూలినా పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం కలుగుతుందని పలువురు చెబు తున్నారు. కల్వర్టు బలహీనంగా ఉండడంతో ప్రయాణికులు, వాహనచోదకు లు భయాందోళన చెందుతున్నారు. ఇక్కడ వాహనాలుఏ మాత్రం అదుపు తప్పినా కాలువలోకి దూసుకువెళ్లే అవకాశముది. అధికారులు దృష్టి సారిం చి తక్షణమే కల్వర్టు వద్ద మరమ్మతులు చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2022-11-24T00:37:33+05:30 IST