పట్టుతప్పితే..పెనుప్రమాదం

ABN , First Publish Date - 2022-11-07T23:45:31+05:30 IST

రాజాం పట్టణంలోని అమ్మవారికాలనీ సమీపంలోని సత్యసాయి మందిరం వద్ద విద్యుత్‌ స్తంభం వద్ద ప్రమాదం పొంచిఉంది.

పట్టుతప్పితే..పెనుప్రమాదం
స్తంభంపై భాగంలో విరిగిన దృశ్యం

రాజాం రూరల్‌: రాజాం పట్టణంలోని అమ్మవారికాలనీ సమీపంలోని సత్యసాయి మందిరం వద్ద విద్యుత్‌ స్తంభం వద్ద ప్రమాదం పొంచిఉంది. ఏ కొద్దిపాటి పట్టు తప్పినా స్తంభం కూలిపోయే ప్రమాద ముందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. స్తంభం చివరిభాగం విరిగిపోవడంతో ఏ క్షణంలోనైనా నేలకొరిగే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం సంభవించకముందే స్తంభాన్ని మార్చాలని అమ్మవారి కాలనీవాసులు కోరుతున్నారు.

Updated Date - 2022-11-07T23:45:37+05:30 IST

Read more