జీతాలు చెల్లించకపోతే పోరాటం తప్పదు

ABN , First Publish Date - 2022-11-23T00:03:32+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఏఐటీ యూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్‌ ఆగ్ర హం వ్యక్తం చేశారు.

జీతాలు చెల్లించకపోతే పోరాటం తప్పదు

విజయనగరం దాసన్నపేట: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఏఐటీ యూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్‌ ఆగ్ర హం వ్యక్తం చేశారు. మంగళవారం కార్మికుల జీతాలు చెల్లించాలని కోరుతూ కేంద్రా సుపత్రి, ఘోషాసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇచ్చినా, జీతాలు పెంచకుండా కార్మి కుల శ్రమ దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దశల వారీ పోరాటంలో భాగంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లా ప్రభు త్వ, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన 549 జీవో ప్రకారం జీతాలు ప్రకటించి ప్రైవేటు కాంట్రాక్టర్ల చేతిలో పెట్ట డం దారుణమన్నారు. జీవో ప్రకారం జీతాలు ఇప్పించాలని, లేని పక్షంలో దశలవారీ పోరాటం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కేంద్రాసుపత్రి, ఘోషాసుపత్రి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T00:03:32+05:30 IST

Read more