ఆర్డీవోగా హేమలత

ABN , First Publish Date - 2022-10-09T05:29:08+05:30 IST

పార్వతీపురం సబ్‌కలెక్టర్‌ భావ్నకు బదిలీ అయ్యింది. గ్రామ,వార్డు సచివాలయాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది.

ఆర్డీవోగా హేమలత

పార్వతీపురం, అక్టోబరు8 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం సబ్‌కలెక్టర్‌ భావ్నకు బదిలీ అయ్యింది.  గ్రామ,వార్డు సచివాలయాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. పార్వతీపురం ఆర్‌డీవోగా ప్రస్తుతం పాలకొండలో పనిచేస్తున్న హేమలతను నియమించారు. ఆమె త్వరలోనే విధుల్లో చేరనున్నారు.  సబ్‌కలెక్టర్‌కు బదిలీ కాగా ఆమె స్థానంలో పాలకొండ ఆర్డీవోను నియమించడంతో  పట్టణంలో పట్టణంలో బ్రిటిష్‌ కాలం నుంచి సబ్‌కలెక్టరేట్‌ ఆర్డీవో కార్యాలయంగా మార్చే పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు విజయనగరంలో ఆర్డీవో కార్యాలయం ఉండగా అక్కడ గ్రూప్‌-1 అధికారి బాధ్యతలను నిర్వర్తించేవారు. పార్వతీపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంగా కొనసాగింది. తాజాగా పార్వతీపురం జిల్లా కేంద్రం కావడంతో ప్రస్తుతం ఉన్న సబ్‌ కలెక్టరేట్‌ ఆర్డీవో కార్యాలయంగా మారనుంది.


Read more