భారీగా వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2022-01-04T05:20:50+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మళ్లీ ఊపందుకుంది. 15నుంచి 18 ఏళ్ల మధ్య పిల్లలకు వ్యాక్సినేషన్‌ అవకాశం కల్పిం చడంతో వైద్య సిబ్బంది విద్యాల యాలకు వెళ్లి టీకాలు వేశారు.

భారీగా వ్యాక్సినేషన్‌
విజయనగరంలోని బీపీఎం పాఠశాలలో విద్యార్థినులకు టీకా వేస్తున్న దృశ్యం

విజయనగరం, జనవరి 3: కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మళ్లీ ఊపందుకుంది. 15నుంచి 18 ఏళ్ల మధ్య పిల్లలకు వ్యాక్సినేషన్‌ అవకాశం కల్పిం చడంతో  వైద్య సిబ్బంది విద్యాల యాలకు వెళ్లి టీకాలు వేశారు.  జిల్లా వ్యాప్తంగా 88 పీహెచ్‌సీల పరిధిలో 3300 పాఠశాలలు, 195 కళాశాలలు, 35 ఐటీఐల్లో చదువుతున్న విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు వీలుగా మూడురోజుల ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాలు, విద్యా సంస్థల్లోనూ ఈ కార్యక్ర మం నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం 6గంటల సమయానికి 20వేల మందికి వాక్సినేషన్‌ పూర్తి చేశారు.  

 

Updated Date - 2022-01-04T05:20:50+05:30 IST