మాటల్లో పెట్టాడు.. గొలుసు ఎత్తుకెళ్లాడు

ABN , First Publish Date - 2022-12-13T00:16:28+05:30 IST

సరుకులు కొనేలా నటిస్తూ షాపులో ఉన్న మహిళను మాటల్లో పెట్టాడు.. అటూ ఇటూ చూసి ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును చటుక్కున తెంపేసి పరుగు లంకించుకున్నాడు.

 మాటల్లో పెట్టాడు.. గొలుసు ఎత్తుకెళ్లాడు

రాజాం రూరల్‌: రాజాంలోని తెలగా వీధికి వెళ్లే మార్గంలో ఓ చిన్నషాపు.. షాపులో ఓ వృద్ధ మహిళ, పరిసరాల్లో జన సంచారం లేకపోవడాన్ని గమనించాడో ప్రభుద్దుడు.. షాపు వద్దకు చేరుకున్నాడు.. సరుకులు కొనేలా నటిస్తూ షాపులో ఉన్న మహిళను మాటల్లో పెట్టాడు.. అటూ ఇటూ చూసి ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును చటుక్కున తెంపేసి పరుగు లంకించుకున్నాడు. ఏం జరిగిందో తేరుకున్న మహిళ కేకలు వేసింది. అటుగా వెళ్తున్న వారు ఆ ఆగంతకుడ్ని పట్టుకు న్నారు. అతని చేతిలో ఉన్న సగం తాడును స్వాధీనం చేసుకున్నారు. దేహశుద్ధి చేసి రాజాం పొలీసులకు అప్పగించారు. పుస్తెలతాడు చోరీకి పాల్పడిన వ్యక్తిని పట్టణా నికి చెందిన ఏషాధన్‌గా పొలీసులు గుర్తించారు. గొలుసు పోగొట్టుకున్న మహిళ అప్పలసూరమ్మ పొలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు కావాల్సి ఉంది.

Updated Date - 2022-12-13T00:16:28+05:30 IST

Read more