గూడెపువలస వీఆర్వో సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-11-30T00:08:28+05:30 IST

గూడెపువలస రెవెన్యూ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వీఆర్వో డి.రమణమ్మను ఈనెల 26న జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారని తహసీల్దార్‌ కె.శ్రీని వాసరావు మంగళవారం తెలిపారు.

 గూడెపువలస వీఆర్వో సస్పెన్షన్‌

భోగాపురం: గూడెపువలస రెవెన్యూ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వీఆర్వో డి.రమణమ్మను ఈనెల 26న జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారని తహసీల్దార్‌ కె.శ్రీని వాసరావు మంగళవారం తెలిపారు. ఆయన విలేకర్లకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎయిర్‌పోర్టు భూసేకరణలో 2.42 ఎకరాల డీపట్టా భూమి ఒకరి పేరు మీద ఉండగా, వేరొకరి పేరుపై ఉన్నట్టు వీఆర్వో రమణమ్మ ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. అలాగే 54 సెట్లు భూమికి సంబంధించి ఒకరు అనుభవంలో ఉండగా, వేరొకరి పేరున ఉన్నట్టు సిఫారసు చేశారు. ఒక రైతుకు మంజూరైన పట్టాదారు పాస్‌పుస్తకం రెవెన్యూ కార్యాలయం నుంచి తీసుకొని, సంబంధిత రైతు కు అందజేయకుండా తన వద్దే ఉంచుకున్నారు. ఈ కారణాలతో వీఆర్వో డి.రమణ మ్మను కలెక్టర్‌ సస్పెండ్‌ చేసినట్టు తహసీల్దార్‌ చెప్పారు.

Updated Date - 2022-11-30T00:08:28+05:30 IST

Read more